అదిరిపోయే ఫీచర్స్ తో వివో వై 30 స్మార్ట్ ఫోన్

వివో తన తదుపరి మొబైల్ వివో వై30 ఇండియాలో లాంచ్ చేసింది. చైనాలో దీని వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే మొబైల్ భారతదేశంలో విడుదల చేసిన వివో వై30 యొక్క డౌన్గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది.

అదిరిపోయే ఫీచర్స్ తో వివో వై 30 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ చైనా కంపెనీ అయిన వివో తన తదుపరి మొబైల్ వివో వై30 ఇండియాలో లాంచ్ చేసింది. చైనాలో దీన్ని వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే మొబైల్ భారతదేశంలో విడుదల చేసిన వివో వై30 యొక్క డౌన్గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది. ఒక్క వేరియంట్ లో మాత్రమే ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది, కాస్ట్ వచ్చేసి 15,700 రూపాయలుగా నిర్ణయించారు.

వివో వై30 30 స్టాండర్డ్ ఎడిషన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, పవర్‌వీఆర్ జీఇ8320 జీపీయుతో రూపుదిద్దుకుంది. 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ కలిగి ఉండగా, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు ఇందులో విస్తరించవచ్చు. 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి.. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో నడుస్తుంది.

వివో వై 30 మొబైల్ రెగ్యులర్ మొబైల్ లాగానే స్టాండర్డ్ ఎడిషన్ 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సిడి ప్యానల్‌ ఉంటుంది. 720 x 1600 రిజల్యూషన్, 13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటివి వివో వై30 ప్రత్యేకతలు.

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ వంటి ఫీచర్ తో పాటు, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్‌బి ఒటిజి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ ఇందులో ఉన్నాయి. 4జీ కనెక్టివిటీ ఇందులో లభ్యమవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి