ఏదైనా ఊరు వెళ్ళాలంటే, ట్రైన్ లో వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడుతాం. అందుకు మనకి కావాల్సిన విధంగా రైల్వే శాఖ తమ సదుపాయాలను అందిస్తుంది. కరోనా వచ్చినప్పుడు నుండి కొత్త టెక్నాలజీని ఐఆర్సీటీసీ తీసుకురావడంతో మరింత సులువుగా మారిపోయింది. ప్రయాణికులు ఆన్లైన్ సేవలను ఎక్కువగా వాడటంతో మరిన్ని సేవలను రైల్వే తీసుకువచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, లేటెస్ట్ గా పీఎన్ఆర్ స్టేటస్ మరియు ట్రైన్ జర్నీ విశేషాలతో వాట్సాప్ లో ఎప్పటికపుడు అందుబాటులో ఉండటానికి వీలుగా అవకాశాన్ని కలిపిస్తుంది. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన సమాచారం, రాబోయే స్టాప్‌లు వంటి వివరాలు కోసం మనం తరుచుగా వివిధ వెబ్సైట్లలో వెతుకుతూ టైం వృధా చేసుకుంటాం. కానీ ఇపుడు ఐఆర్సీటీసీ “రైలోఫీ” అనే కొత్త సౌకర్యం తీసుకువస్తునట్టు రైల్వే శాఖ పేర్కొంది.
మీరు గనక ఇటువంటి పూర్తి డిటైల్స్ కావాలనుకుంటే ముందుగా చేయవలసిన పని..రైలోఫీకి చెందిన మొబైల్ నెంబర్ ని +91 9881193322 ని మీ స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకోవటం. తరువాత మీరు బుక్ చేసుకున్న రైలు యొక్క 10 అంకెల పీఎన్ఆర్ నంబర్‌ను ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తే చాలు. ఇక మీకు కావాల్సిన ట్రైన్ సమాచారాన్ని పొందవచ్చు.
రైల్వే శాఖ రికార్డు ప్రకారం రోజుకి కోటి మందికి పైగా పీఎన్ఆర్ స్టేటస్ కోసం గూగుల్ లో వెతుకుతున్నారు అని.. అందుకు వినియోగదారులకు సులువుగా ఉండేదుకు ఈ సదుపాయం కలిపిస్తునాము అని ప్రకటించింది. బుక్ చేసుకున్న ట్రైన్ లేటుగా వస్తుందా లేదా టైంకి నడుస్తున్నదా? ఎన్ని స్టాప్ లు ఉన్నాయి? ఇటువంటి మరిన్నివిశేషాలు వాట్సాప్ లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. నిజంగా ఇది ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి.