టీడీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సోము వీర్రాజు

టీడీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. సీనియర్ నాయకులు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా పార్టీ జంప్ చేస్తున్నారు.

నాయకుడి మీద నమ్మకం లేకో, అధికార పార్టీలోకి వెళ్తే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే అబిప్రాయమో వారిని అధికార పార్టీ వైపుకు మళ్ళిస్తుంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు.

ఇక మరి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం లేకపోలేదు. దింతో టీడీపీ కేడర్ కొద్దిగా గుబులుగా ఉంది. ఇంతకాలం వైసీపీ నేతలతో పోట్లాడి ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకుంటే తన పరువు ఎం కావాలని అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే చాలా మంది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక వీరికి గాలం వేసే పనిలో నిమగ్నమైంది బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఎవరైనా తమ పార్టీలో చేరొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల కోసం తమ పార్టీ గేట్లు ఎప్పుడు తెరుచునే ఉంటాయని తెలిపారు.

ఇక ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి కౌంటర్ కూడా ఇచ్చారు సోము, భారతీయ జనతాపార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించినట్లు తెలుస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఇకపై కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాలపైన 22 పథకాల అమలు తీరును పరిశీలిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటుందని తెలిపారు సోము. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు వీర్రాజు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి