ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో తమ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తునట్టు తెలిపింది. లెనోవో K 12 పేరుతో వస్తున్నట్టు తెలుపగా..ఇది మోటో ఈ7 మోడల్ కి లేటెస్ట్ వెర్షన్ అని తెలిపింది. యూరోపియన్ మార్కెట్లలో K 12 మోడల్ గత నెలల విడుదల చేసింది. ఇప్పటికే లెనోవో K12 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో దీని హవా నడుస్తుంది. లెనోవో K12 స్మార్ట్ ఫోన్ గతంలో చైనీస్ మార్కెట్లో విడుదలైన మోటో ఈ7 ప్లస్‌కు ఆధునిక వెర్షన్ అని నిపుణులు పేర్కొన్నారు.
మోటో ఈ7 మోడల్‌ను ఆధునీకరించి విడుదల కాబోతున్నలెనోవో K12 స్మార్ట్ ఫోన్ దేశ మార్కెట్లలో ధర 10,550/- ఉంటుందని అంచనా. లెనోవో K 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ టచ్ స్ర్నీన్‌ను కలిగి, 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్, 5 ఎంపీ షూటర్‌తో లభిస్తుంది. సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్ కెమెరా కలిగి ఉంటుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. మీడియాటెక్ హీలియోస్ జీ25 చిప్సెట్తో వర్క్ చేయనున్నది.
బ్యాటరీ విషయానికి వస్తే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్నికలిగి ఉండటం విశేషం. ఆండ్రాయిడ్ వెర్షన్ 10 తో లభించవచ్చు అని అంచనా.