యానిమేషన్ డెవలపర్స్కి ఆగ్మెంటేడ్ అండ్ వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్స్ కి యూస్ చేసే ఫ్రీ 3డీ యానిమేషన్ ఇమేజెస్ ను గూగుల్ పోలీ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు. 3డీ మోడల్ షేరింగ్ వెబ్సైట్ పాలీని, మూడు సంవత్సరాలుగా గూగుల్ పోలీ వెబ్ సైట్ అందిస్తుంది అని చాలా మందికి తెలీదు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై ఆ సర్వీసెస్ లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. 2021, ఏప్రిల్ 30 నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి న్యూ కంటెంట్ ని అప్లోడ్ చేయడానికి యూజర్స్ కి వీలు ఉండదు. జూన్ 30 కంటే ముందు పోలీ వెబ్ సైట్ లో ఉన్న కంటెంట్ ని వినియోగదారులు గూగుల్ టేక్అవుట్ ద్వారా తమ డేటాను డౌన్లోడ్ చేసుకోవాలని గూగుల్ తెలియచేసింది. ఈ వార్త యానిమేషన్ డెవలపర్స్కి పెద్ద లాస్ అనే చెప్పాలి.
ఇప్పుడు వరకు పోలీ వెబ్ సైట్ ను ఉపయోగిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పింది. మూడేళ్లుగా తమ సర్వీసెస్ పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపింది గూగుల్. పోలీ వెబ్ సైట్ ఎందుకు నిలిపివేస్తున్నది మాత్రం కారణం చెప్పలేదు.