హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటునట్టు పొస్ ఇచ్చి ఫోటో దిగితే ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. మరింత సౌకర్యం కోసం, స్టైల్ గా కనబడటం కోసం వైర్లెస్ హెడ్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వీటి అన్నిటికి చెక్ పెట్టేందుకు మరింత ఆకర్షించేలా వైర్లెస్ హెడ్ ఫోన్స్ తో ఇపుడు మార్కెట్లో అడుగుపెట్టేందుకు ఆపిల్ సిద్ధమైంది.
ఈ గ్లోబల్ టెక్ దిగజ్జం హెడ్ ఫోన్స్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. యాపిల్ వెబ్సైట్, ఆధీకృత రిటైలర్ల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లు, ఇండియాలో దీని వెల 59,000/- రూపాయలు ఉంటుంది అని తెలిపింది. ఇది 25 దేశాలు, ప్రాంతాలకు మాత్రమే విక్రయిస్తున్నట్టు సమాచారం. ఐప్యాడ్లు తదితర యాపిల్ డివైస్‌లు ఐవోఎస్ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పాటు మ్యాక్ ఓఎస్ బిగ్ 11.1 లేదా తదుపరి అప్‌గ్రేడ్స్ ద్వారా ఈ హెడ్ ఫోన్స్ ఉపయోగపడతాయని ఆపిల్ వివరించింది. ఓఎస్14.3 వెర్షన్ టీవీ, ఓఎస్ 7.2 ఆపిల్ వెర్షన్ వాచీలకు ఈ హెడ్ ఫోన్స్ పనిచేస్తుంది.
యాపిల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గ్రెగ్ జాస్వియక్ హెడ్ ఫోన్స్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌పోడ్స్ జనాదరణ పొందింది అని, ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ ద్వారా మరింత క్వాలిటీ ఆడియో ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చని చెప్పారు. వినియోగదారులుకు ఉత్తమైన వైర్లెస్ ఆడియోను ఆనందించటానికి ప్రతిభావంతమైన హెచ్1 చిప్, ఆధునిక డిజైన్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్, మరిన్ని స్పెషలిటీలతో వైర్లెస్ హెడ్ ఫోన్స్ తాయారు చేసినట్టు వివరించారు. ఎడాప్టివ్ ఈక్విలైజర్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత, అలాగే మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర నాయిస్ రిడక్షన్ ఉంటుందని తెలియచేసారు.
దీని బరువు 384 గ్రాములు ఉండగా; సిల్వర్, స్పేస్ గ్రే, స్కై బ్లూ, పింక్, అండ్ గ్రీన్ రంగులలో లభ్యమవుతుంది. డిసెంబర్ 15 నుండి మన దేశంలో సేల్స్ మొదలవుతాయి అని తెలుపగా..హెడ్ ఫోన్ ధర గురించి నిపుణులతో పాటు, ఆపిల్ ఫోన్ ప్రియులను నిరాశపరిచింది. ఐఫోన్ కొనాలి అంటే కిడ్నీ అమ్ముకోవాలి అని కామెంట్లు పెట్టిన నెటిజన్లు.. హెడ్ ఫోన్ ధర గురించి ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.