హైదరాబాద్ లో మాయమవుతున్న మనుషులు.. ఒకే రోజు 11 మంది అదృశ్యం

హైదరాబాద్ లో మాయమవుతున్న మనుషులు.. ఒకే రోజు 11 మంది అదృశ్యం

హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మిస్ అయినవారు ఎటు పోతున్నారు. ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలుసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కేవలం 24 గంటల వ్యవధిలో 11 మంది మిస్సింగ్ అయినట్లుగా నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.

ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ, కూతరు కనిపించటం లేదని కేసు ఫైల్ అయ్యింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 19 ఏళ్ల యువతి వనిత కనిపించటం లేదని కుటుంబ సభ్యులు కంప్లయింట్ ఇచ్చారు. హయత్ నగర్ పరిధిలో అక్క, తమ్ముడు అదృశ్యం కావటం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ పరిధిలో ఓ యువతి, మరో బాలిక కనిపించటం లేదని ఫిర్యాదులు వచ్చాయి.

ఎల్బీ నగర్ పరిధిలో ఒకరు మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అదృశ్యం అయినట్లుగా కేసులు నమోదయ్యాయి. తమ వారిని ఎలాగైనా వెతికిపెట్టాలని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. ఇక మిస్సింగ్ కేసులను కనిపెట్టడం పోలీసులకు సవాల్ గా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు