ప్రతి రోజు గూగుల్ లో ప్రజలు ఏదో ఒక దాని కోసం వెతికేస్తూనే ఉంటారు.ఇలా వెతికిన సెర్చ్ రిజల్ట్సను గూగూల్ తన Google Trends ద్వారా చూపిస్తుందనే విషయం మనకి తెలిసిందే. మరి ఇలా గూగుల్ లో ఇవాళా అంటే 12-10-2020 రోజున ట్రెండ్ అయిన విషయాలు ఏంటో ఒకసారి చూదాం
1NEET 2020 Result Date – నీట్ – 2020 రిజల్ట్ డేట్ ఏప్పుడు
వైద్యకళాశాలల్లో ఎంట్రన్స్ కోసం నిర్వహించిన NEET – 2020 ఫలితాలు ఈ రోజు విడుదల అవుతాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా NEET 2020 Result Date అని సెర్చ్ చేశారు. ఒక వేళ ఈ రోజు NEET result వస్తే గూగుల్ ఇదే టాప్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే 12-10-2020 కి టాప్ సెర్చ్ రిజల్డ్ గా NEET – 2020 Result Date నిలిచింది.
2Marcus Stoinis Runout – స్టాయినిస్ రన్ అవుట్
IPL – 2020 లో భాగంగా ఢిల్లీ స్పీడ్ కు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. ఢిల్లీ టీమ్ ఒక పది పరుగులు ఎక్కువ చేసిన ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచేది. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న పవర్ హిట్టర్ మార్కస్ స్టాయినిస్ మధ్యలో అనూహ్యంగా రన్ అవుట్ అవకుండా ఉంటే కచ్చితంగా ఢిల్లీ గెలిచేది. మరో ఎడ్జ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ చేసిన తప్పు కారణంగా స్టాయినిస్ రన్ అవుట్ అయ్యాడు. ఒక రన్ పూర్తి చేసిన తరువాత మరో రన్ కోసం స్టాయినిస్ మిడ్ ఫీల్డ్ వరకు వచ్చాడు, అయితే శిఖర్ ధావన్ మాత్రం కొద్దిగా ముందుకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడంతో మిడ్ ఫీల్డ్ లో ఉన్న స్టాయినిస్ రన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం స్టాయినిస్ రన్ అవుట్ అయిన విధానం గూగుల్ లో 50 వేలకు పైగా సెర్చలతో ట్రెండింగ్ లో ఉంది.
ICYMI – Fumbled, wrong call, Stoinis run-out.
Suryakumar Yadav fumbled in the deep, Stoinis goes for a second run, miscommunication. Run-out!
📹📹https://t.co/SEIlw1k7w6 #Dream11IPL
— IndianPremierLeague (@IPL) October 11, 2020
3Power cut in Mumbai : ముంబై పవర్ కట్
మహారాష్టలోని ముంబై నగరం మొత్తం ఒక్కసారికి విద్యుత్ నిలిచిపోయింది. టాటా విద్యుత్ లైన్లు ఫెయిల్ అయిన కారణంగా ముంబై మహానగరం మొత్తం ఒక్క సారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని ముంబై మహానగరపాలక సంస్థ BEST వెల్లడించింది. ఈ విద్యుత్ లైన్ ఫెయిల్యూర్ కారణం ముంబై మొత్తం తో పాటు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో అన్ని రకాల సర్వీసులు నిలిచిపోయాయి.మెట్రో రైళ్లు , సబర్బన్ రైళ్లతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ , టెలిఫోన్ , ఇంటర్ నెట్ వంటి సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముంబై మహానగరానికి విద్యుత్ ను సరఫరా చేసే 400KV విద్యుత్ లైన్లు ట్రిప్ అయిన కారణంగానే సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి. విద్యుత్ లైన్లు ట్రిప్ అయిన కారణంగా రైలు, మెట్రో తో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని అధికారికంగా ధృవీకరించారు.