80 శాతం మంది సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు – NCB విచారణలో రియా – అధికారులు షాక్

అందరినీ ఇరికించటం వరకు ఓకేకానీ.. ఎవరి పేర్లు చెప్పి చచ్చిందో ఇది అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు.. ఎవరికి వాళ్లు తేలుకుట్టినోళ్లుగా గుమ్మనంగా ఉన్నారు.

అమ్మతోడు ఇది అబద్ధం కాదు.. పచ్చి నిజం.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి స్వయంగా చెప్పిన వివరాలు ఇవి.. ఇదే ఇప్పుడు హిందీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలకు కుదిపేస్తోంది.

సినిమా వాళ్లు అందరికీ డ్రగ్స్ అలవాటు :

డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు.. ఎక్కడ తీసుకుంటారు.. ఎవరు సప్లయ్ చేస్తారు.. ఈ ప్రశ్నలకు రియా చెప్పిన సమాధానం అధికారులకే దిమ్మతిరిగింది. మూడు రోజుల విచారణలో ఎన్నో.. ఎన్నెన్నో డ్రగ్స్ విషయాలు వెల్లడించింది అంట. వాళ్లు, వీళ్లు అని తేడా లేదు.. 80 శాతం మంది సినిమా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు.. వీరిలో హీరోలు ఉన్నారు.. హీరోయిన్స్ ఉన్నారు.. నిర్మాతలు ఉంటారు.. దర్శకులు ఉంటారు.. చాలా మంది డ్రగ్స్ అలవాటు ఉంది. ఇది కొత్త ఏమీ కాదు.. నాకు తెలిసి సంవత్సరాలుగా జరుగుతుంది.

ఈజీగా దొరుకుతాయి డ్రగ్స్ :

డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి.. ఎవరు ఇస్తారు అనే ప్రశ్నలకు కూడా రియా చక్రవర్తి చెప్పిన సమాధానాలు షాకింగ్ కు గురి చేశాయి. ఎవరు ఇస్తారు అంటే ఏమని చెప్పను.. ఒక్కొక్కరికి ఒక్కో డీలర్ ఉంటాడు.. నాకు ఓ డీలర్ పరిచయం.. అలాగే చాలా మందికి చాలా మంది డ్రగ్స్ తెచ్చి ఇస్తుంటారు. ఎవరి బ్యాచ్ వాళ్లదే.. ఆయా గ్రూప్స్ లో మెసేజ్ పెడితే.. డ్రగ్స్ వచ్చేస్తాయి. డబ్బు చెల్లింపులు కూడా ఆన్ లైన్ ద్వారానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. సినిమా ఇండస్ట్రీలో 80 శాతం మందికి ఇది కామన్.. ఇందులో దాపరితం, సీక్రెట్స్ ఏమీ లేదు. డ్రగ్స్ కావాలి అంటే నిమిషాల్లో వచ్చేస్తోంది.. పార్టీలు జరిగితే అందులో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పింది.

నా బ్యాచ్ లో 25 మంది :

80 శాతం సినీ ఇండస్ట్రీ వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పిన రియా.. ఎవరి గ్యాంగ్ వాళ్లదే అని వెల్లడించింది. నాకు తెలిసి 25 మందికి నేను డ్రగ్స్ సప్లయ్ చేశాను.. ఈ డ్రగ్స్ లో వారితో నాకు లింక్స్ ఉన్నాయి.. మిగతా వాళ్ల సంగతి తెలియదు.. వాళ్లు ఎక్కడి నుంచి.. ఎవరి నుంచి తెచ్చుకుంటారో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చిందంట. సినీ ఇండస్ట్రీలోని అందరికీ డ్రగ్స్ విషయంలో నోటీసులు ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి.. రియా చెప్పిన 25 మందిని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

80 శాతం మంది అని అందరినీ ఇరికించటం వరకు ఓకేకానీ.. ఎవరి పేర్లు చెప్పి చచ్చిందో ఇది అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు.. ఎవరికి వాళ్లు తేలుకుట్టినోళ్లుగా గుమ్మనంగా ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి