టాప్ హీరోయిన్ అనుష్కశెట్టి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చారు.. అవును మీరు నిజమే విన్నారు.. చదువుతున్నారు. తన మిత్రులతో కలిసి తూర్పుగోదావరి నుంచి బోటులో బయలు దేరి… పశ్చిమగోదావరిలోని పోలవరంలోకి ప్రవేశించారు. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలోని నది మధ్యలో ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అనుష్క పోలవరం పర్యటన అంతా ఎంతో రహస్యంగా సాగింది. ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉండటంతో ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అనుష్క టూర్ మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులు దగ్గరుండి చూసుకున్నారు.
తూర్పుగోదావరికి వచ్చిన అనుష్క.. అక్కడి నుంచి బోటులో ప్రయాణించారు. అనుష్కతోపాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. నందీశ్వర ఆలయానికి వెళుతున్న సమయంలో అరటికాయలు, పూలు, ఇతర పండ్లను తీసుకెళ్లి శివయ్యను అభిషేకించారు.
నందీశ్వరుని ఆలయంలో స్వామి దర్శనం తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను కూడా బోటు ద్వారానే చూసి వచ్చారు.