శ్రావణి చావుకు దేవరాజ్, సాయి ఇద్దరూ కారణమే – తేల్చేసిన పోలీసులు – అరెస్ట్ కు రెడీ

ఆ సమయంలో దేవరాజ్ ను పెళ్లి చేసుకుంటాను అని శ్రావణి అంటే.. నేను చేసుకోను అని

నటి శ్రావణి డెత్ మిస్టరీ వీడుతోంది. విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. సాయితోపాటు దేవరాజ్, శ్రావణి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అందర్నీ కూర్చోబెట్టి.. విడివిడిగా స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. విచారణ క్లయిమాక్స్ కు వచ్చింది.

ఇద్దరూ నిందితులే :

శ్రావణి ఆత్మహత్య వెనక దేవరాజ్, సాయి ఇద్దరూ ఉన్నారని.. వీరి వైఖరి, వేధింపులు, బెదిరింపులు ఉన్నాయని అంటున్నారు పోలీసులు. దేవరాజ్, సాయి ఎవరికి వాళ్లు శ్రావణిని వాడుకోవాలని చూశారని.. తమ స్వార్థం కోసం బెదింపులకు దిగారు అని తేల్చారు. ఏడాది క్రితమే దేవరాజ్ పరిచయం అయ్యాడని.. అప్పటి నుంచే శ్రావణి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు. అప్పటి వరకు సాయి కంట్రోల్ లో ఉన్నారు శ్రావణి, వారి కుటుంబ సభ్యులు. సాయితోనే శ్రావణి పెళ్లి అని ఇంట్లో వారు కూడా అనుకున్నారు.. అందుకే సాయి మాటకే విలువ ఇచ్చేవారు శ్రావణి ఫ్యామిలీ.. ఇప్పుడు కూడా దేవరాజ్ వల్లే శ్రావణి చనిపోయింది అని ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట స్టేట్ మెంట్ ఇచ్చారు.

ప్రేమ పేరుతో దేవరాజ్ మోసం :

ప్రేమ పేరుతో దేవరాజ్ మోసం చేశాడని చెబుతున్నారు శ్రావణి పేరంట్స్. తనపై ఉన్న కేసులను కొట్టి వేయించుకునేందుకు శ్రావణితో ప్రేమ నాటకం ఆడాడు అని చెబుతున్నారు. పెళ్లి చేసుకోమని శ్రావణి కోరినా.. దేవరాజ్ ఎందుకు నిరాకరించాడు అని పేరంట్స్ పోలీసులనే ప్రశ్నిస్తున్నారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో దేవరాజ్ ను పెళ్లి చేసుకుంటాను అని శ్రావణి అంటే.. నేను చేసుకోను అని దేవరాజ్ అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. శ్రావణి డబ్బు, కెరీర్ అడ్డం పెట్టుకుని ఎదగాలని చూశాడని.. అతడి వల్లే శ్రావణి చనిపోయింది అని శ్రావణి పేరంట్స్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

శ్రావణి ఆత్మహత్య కన్ఫామ్ అయినా.. కారకులు ఎవరు అనేది నిర్థారిస్తున్నారు పోలీసులు.. సాయి, దేవరాజ్ ఇద్దరి పాత్ర ఉందీ ఇందులో..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి