ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మా గ్రామ పరిథిలోని అడవుల్లో అత్యంత పురాతనమైన ఆలయ విశేషాలను చరిత్రకారులు కనుకొన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు చంద్రనారాయణ స్వామి ఆలయంగా పిలుచుకునే ఈ ఆలయాన్ని రాక్షస రాజులు నిర్మించి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు.
నాగదేవత,గణపతి దేవుడి విగ్రహాలతో పాటు రాతితో చెక్కిన అనేక విగ్రహాలు ఈ ఆలయ పరిధిలో ఉన్నాయి.అయితే ఆలయ ముఖద్వారం తూర్పువైపు కాకుండా,పడమరవైపు నిర్మించి ఉంది. ఆలయనిర్మాణం అనేక కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయి ఉండవచ్చని వెల్లడించారు. స్థానికులు సైతం ఈ ఆలయాన్ని రాక్షస రాజులే నిర్మించారని నమ్ముతుంటారు.
పక్షి పేమికుడైన లింగంపల్లి కృష్ణ అనే వ్యక్తి పక్షుల ఫోటోలు తీసేందుకు అడవిలోకి వెళ్లిన సమయంలో ఈ ఆలయాన్ని మొదటిగా కనుగొన్నారు. ఇక్కడ స్థానికులకు ఈ ఆలయం గురించి ఎప్పటి నుండే తెలిసిన పెద్దగా పట్టించుకోలేదు. ఆలయంలో ఉన్న దేవత విగ్రాహాలు, నిర్మాణ శైలిని గమనించిన ఆయన చరిత్ర కారులకు ఈ విషయం చెప్పడం, వారు గమనించిన అనంతరం ఈ ఆలయ చరిత్ర బయటకు తెలిసింది.