కరోనాతో వ్యవసాయ శాఖామంత్రి మృతి

కరోనాతో వ్యవసాయ శాఖామంత్రి మృతి

కరోనా మహమ్మారి ప్రజలను కబళిస్తుంది. ప్రాణాలు హరిస్తుంది. కేంద్ర మంత్రులు కూడా ఈ మహమ్మారి బారినపడి మృతి చెందుతున్నారు. ఈ మహమ్మరే రాకపోతే, ఈ రోజు బాలసుబ్రమణ్యం పోయేవారు కాదు. ప్రణబ్ ముఖర్జీ పోయేవారు కాదు. సురేష్ ఆగండి పోయేవారు కాదు. లక్షమంది ప్రజలు పోయేవారు కాదు. ఇది తరతమ బేధం లేకుండా కబళిస్తుంది.

ఈ మహమ్మారి బారినపడి.. తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ డోరైకన్నూ శనివారం రాత్రి మరణించారు. గతనెలలో 72 ఏళ్ల డోరైకన్నకు కరోనా సోకింది.. దాంతో ఆయనను అక్టోబర్ 13న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే గత 2 రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దాంతో వైద్యులు డోరైకన్నూను లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉంచారు. అయిన ఆయన ప్రాణాలతో తిరిగి రాలేకపోయారు. వయసు మీదపడటంతో కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోయారు డోరైకన్నూ.

తంజావూరు జిల్లాలోని పాపనాసం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డోరైకన్నూ.. పళనిస్వామి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డోరైకన్నూ మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం పళనిస్వామి. ఓ గొప్ప నేతను కోల్పోయామని అన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు