పర్యాటకులను పక్కకు పెట్టి అల్లు అర్జున్ ని లోపలికి పంపారు.

లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో సినీమా షూటింగులు మొదలు పెట్టారు. ఇక ఇంతకాలం ఇంట్లో ఉన్న సెలెబ్రెటీలో ఫ్యామిలీతో సరదాగా ఆలా బయటకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మన ప్రాంతంలో ఉండే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ హీరో అల్లు అర్జున్‌ శనివారం కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం జాలువారే అందాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు.

అయితే ఇంతకాలం జలపాతం చూసేందుకు పర్యాటకులను అనుమతించలేదు. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు రావద్దని నిబంధనలు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా చూసేందుకు అనుమతి లేదని పర్యాటకులకు చెప్పి.. అల్లు అర్జున్ కుటుంబానికి దగ్గరుండి చూపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సెలెబ్రెటీలకు ఓ న్యాయం తమకు ఓ న్యాయమా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి