అల్లు అర్జున్ తో ఫోటో దిగేందుకు ఎగబడిన ఫ్యాన్స్

కరోనా కారణంగా సెలెబ్రెటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. నాలుగు నెలల సుదీర్ఘ విశ్రాంతి తర్వాత ఇప్పుడిప్పుడే బయట ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ స్నేహితులతో కలిసి టూర్ వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతాన్ని సందర్శించారు. అర్జున్ అక్కడికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫోటోల కోసం ఎగబడ్డారు.

కొందరికి ఫొటోస్ ఇచ్చిన అర్జున్ సమయం లేకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా ఆయన సొంతంగా డిజైన్ చేయించుకున్న మాస్క్ ధరించారు. ఆ మాస్క్ పై AA అక్షరాలు రాసి ఉన్నాయి. తన డ్రెస్ కలర్ కు మ్యాచింగ్ మాస్కు ధరించాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. పైగా పుష్ప చిత్రం కోసం పెంచిన ఉంగరాల జుత్తు కూడా బన్నీకి అదనపు సొగసు తెచ్చిపెట్టింది. కుంటాల జలపాతం వద్దకు వచ్చిన అల్లు అర్జున్ కు అధికారులు అక్కడి ప్రాశస్త్యాన్ని వివరించారు. కుంటాల జలపాతం… రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేర్కొంది. వర్షాలు పడుతుండటంతో జలపాతం అందరికి కనువిందు చేస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి