అమిత్ షాకి అనారోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక

గత కొద్దీ రోజులుగా కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా కు ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. గత నెల 2 కరోనా బారినపడిన ఆయన గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆగష్టు 14 న డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం విధులకు హాజరయ్యారు. అయితే మరోసారి అనారోగ్యంతో ఆగష్టు 18 న ఢిల్లీ ఎయిమ్స్ లో చేశారు. అక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించారు.

అప్పుడు ఆయనకు అలసట, ఒళ్లు నొప్పుల వంటివి ఉన్నాయని తెలిసింది. ఆగస్ట్ 31న డిశ్చార్జి అయ్యారు. తాజాగా శనివారం రాత్రి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే. రాత్రి 11 గంటలకు ఆయన మరోసారి ఎయిమ్స్‌లో చేరినట్లు తెలిసింది. కాగా కరోనా బారిన పడిన నాటి నుంచి ఆయనకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి