ఆమ్రపాలి ఐఏఎస్ కు అరుదైన అవకాశం

ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు సుపరిచితం.. చురుకుగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లలో మొదటి స్థానంలో ఉంటారు ఆమ్రపాలి. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియేట్ లో డిప్యూటీ కార్యదర్శి హోదాలో ఉన్నారు. 2010 ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ కలెక్టర్ గా పనిచేశారు.. ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించారు.

తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతిచిన్న వయసులో మూడేళ్ల కాలానికి ఈ పదవిలో నియమించబడిన అధికారిగా ఆమె రికార్డులు క్రియేట్ చేశారు. ఈ నియామకానికి సంబంధించి శనివారం పీఎంఓ నుండి ప్రకటన వెలువడగా రఘురాజ్ రాజేంద్రన్ పీఎంఓ డైరెక్టరుగా, డిప్యూటీ సెక్రటరీగా అమ్రపాలి కటా, అండర్ సెక్రటరీగా మంగేష్ గిల్డియాల్ నియమించబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ క్యాడర్ కు వచ్చిన ఐఎఎస్ అధికారి అమ్రపాలి కటా కొద్దికాలం డిప్యూటీ హోమ్ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పనిచేయగా ఇప్పుడు పీఎంఓలోకి చేరారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి