అన్నా డీఎంకే సీఎం అభ్యర్థిగా పళని స్వామి

తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.. జయలలిత మృతి చెందిన తర్వాత సీఎం సీట్ కోసం, పన్నీరు, పళనిస్వామి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.. కానీ చివరకు శశికళ మద్దతుతో పళనిస్వామికే సీఎం సీట్ దక్కింది. ఇక 2021 లో జరగనున్న ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా ఎవరుండాలి అనే దానిపై బుధవారం సిట్టింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 11 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి పళనిస్వామికి ఆరుగురు మద్దతు పలికారు. దింతో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.

 

జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెకు అత్యంత సన్నిహితుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగారు.. ఆమె మృతి చెందిన తర్వాత కొద్దీ రోజుల వరకు పన్నీర్ సెల్వమ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పన్నీర్ ను సీఎం సీటు నుంచి దించేశాయి. పళనిస్వామిని సీఎం సీట్ లో కూర్చోబెట్టాయి. అప్పటినుంచి పళనికి, పన్నీరుకి మధ్య దూరం పెరిగింది.. పన్నీర్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి