OMG : మరోసారి లాక్ డౌన్ దిశగా దేశం

OMG : మరోసారి లాక్ డౌన్ దిశగా దేశం.. ఏప్రిల్ 11వ తేదీ వరకు మాల్స్ అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశించింది యోగీ ఆదిత్యనాథ్ సర్కార్. సినిమా ధియేటర్లు బంద్ చేయాలని

Another lockdown various states in india, Covid second wave
Another lockdown various states in india, Covid second wave

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాలు లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ ఒక్క రోజే 75 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కట్టడి చర్యలకు సిద్ధం అయ్యాయి ప్రభుత్వాలు. ఏయే రాష్ట్రంలో ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధిస్తున్నారో చూద్దాం..

> మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె సిటీలో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు 12 గంటలు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోటల్స్, సినిమా హాళ్లు, ధియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్స్ అంతెందుకు కూరగాయల షాపులు కూడా మూసివేయాలని నిర్ణయించింది. సామూహికంగా నిర్వహించే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రజలను కోరింది.

> చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా మొత్తం లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.

> ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు మాల్స్ అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశించింది యోగీ ఆదిత్యనాథ్ సర్కార్. సినిమా ధియేటర్లు బంద్ చేయాలని సూచించారు. స్కూల్స్, కాలేజీలు మూసివేసి వెంటనే శానిటైజ్ చేయాలని సూచించింది.

> తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ అన్నీ బంద్ చేశారు. మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు

> ఆంధ్రాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. పరిషత్ ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉండటంతో.. కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి