రథం దగ్థం ప్రదేశంలో 20 శాంపిల్స్ సేకరణ – కొత్త రథం డిజైన్ విడుదల

స్వామివారి రథానికి నాణ్యమైన చెక్కను అన్వేషిస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవాలు జరిగే

అంతర్వేది ఆలయం రథం దగ్ధం కేసులో.. విచారణ వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. సీబీఐ దర్యాప్తుకు జీవో జారీ చేసి కేంద్రానికి నివేదించింది. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. కేసును సీబీఐ టేకప్ చేయనుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఈలోపు రాష్ట్ర దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం చేశాయి.

20 శాంపిల్స్ సేకరణ :

అంతర్వేది రథం దహనం అయిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. 20 శాంపిల్స్ సేకరించింది. చుట్టుపక్కల ప్రదేశాలను తనిఖీ చేసింది. కాలిపోయిన రథం చెక్కలను సేకరించింది. గోడలపై ఉన్న మట్టిని తీసుకుంది. రథం ఉన్న ప్రదేశంలో కాలిపోయిన ఇటుకలను కూడా తీసుకున్నది. అన్ని కలిపి 20 శాంపిల్స్ సేకరించారు అధికారులు. వీటిని పరీక్షించటానికి మూడు రోజుల సమయం పడుతుందని.. అప్పటి వరకు ఏ విషయం నిర్థారించలేం అని వెల్లడించారు అధికారులు.

మూడు రోజుల్లో ప్రాథమిక నివేదిక :

ఫోరెన్సిక్ టీం సేకరించిన శాంపిల్స్ ఆధారంగా మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు అధికారులు. మానవ తప్పిదం వల్ల జరిగిందా.. కుట్ర కోణం ఉందా.. ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణాల్లో విచారణ జరుగుతుందని ప్రకటించారు అధికారులు.

కొత్త రథం డిజైన్ విడుదల :

నూతన రథం నిర్మాణానికి దేవాదాయ శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 38.2 అడుగుల ఎత్తు, 12.10 అడుగుల వెడల్పు, చక్రాల పైభాగాన 20.6 అడుగుల పొడవుతో నమూనా సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం, పండితుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. కమిటీల ఆధ్వర్యంలో స్వామివారి రథానికి నాణ్యమైన చెక్కను అన్వేషిస్తున్నారు. స్వామివారి కల్యాణోత్సవాలు జరిగే మహోత్తర ఘట్టమైన ఈ రథోత్సవంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అంతర్వేది ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టటానికి సీబీఐ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఇక బంతి కేంద్రం దగ్గర ఉంది.. దీన్ని ప్రతిపక్షాలు ఎలా డీల్ చేస్తాయి అనేది ఆసక్తికరం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి