ఏపీలో కొత్తగా 32 జిల్లాలు – ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుందంటే

32 new districts to be formed in andhrapradesh

ఏపీలో ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని ఒక్కో జిల్లాగా మార్చి పరిపాలనను మరింట సులభతరం చేస్తానని ఎన్నికల సమయంలో వైయస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గతంలోనే ప్రకటనలు వెలువడినప్పటికి, అందుకు సంబంధించిన పనులు మొదలుకాలేదు. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని గతంలో ప్రాథమికంగా అనుకున్నారు.

అయితే తాజాగా జరిగిన కేబినేట్ మీటింగ్ లో పలువురు అధికారులు, మంత్రుల సూచనల మేరకు ఏపీలో నూతనంగా 32 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రతిపాదించిన 26 జిల్లాల స్థానంలో 32 జిల్లాలను ఏర్పాటు చేస్తే పరిపాలన మరింత తేలిక అవుతుందని అధికారులు సూచించినట్టు తెలుస్తుంది.

ఇక అధికారులు సైతం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి –  గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, జిల్లాలు – ఆంధ్రా ప్రాంతంలో మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపూర్, ఒంగోలు, నెల్లూరు, గూడూరు కొత్త జిల్లాలు – రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, హిందూపూర్, అనంతపూర్, ఆదోని, కర్నూల్, నంద్యాల, కడప, రాజంపేట జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇక నూతనంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతుంది.

ఏపీలో కొత్తగా 32 జిల్లాలు – ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుందంటే

1.పలాస : ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం
2.శ్రీకాకుళం : శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం
3.పార్వతీపురం : పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ
4.విజయనగరం : విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి
5.విశాఖపట్నం : భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి,
6.అరకు : అరకు, పాడేరు, మాడుగుల
7.అనకాపల్లి : అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని
8.కాకినాడ : ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం
9.రాజమండ్రి : అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు
10.అమలాపురం : రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట
11.నరసాపురం : తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం
12.ఏలూరు : గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు
13.మచిలీపట్నం : కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు
14.విజయవాడ : తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం
15.అమరావతి : పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
16.గుంటూరు : తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు
17.బాపట్ల : రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు
18.నరసరావుపేట : చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19.మార్కాపురం : ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
20.ఒంగోలు : అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు
21.నెల్లూరు : కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి
22.గూడూరు : సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట
23.తిరుపతి : శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి
24.చిత్తూరు : పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం
25.మదనపల్లి : పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి
26.హిందూపురం : కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం
27.అనంతపురం : రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి
28.ఆదోని :  పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం
29.కర్నూలు : నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు
30.నంద్యాల : శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం
31.కడప : జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప
32.రాజంపేట : బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి