హైకోర్టు సంచలన నిర్ణయం ఆ కేసు సీబీఐకి అప్పగింత

హైకోర్టు సంచలన నిర్ణయం ఆ కేసు సీబీఐకి అప్పగింత

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో జడ్జీలపై అసభ్య పోస్టుల కేసు సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. గత కొద్దీ రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ఇక్కడ కొందరు జడ్జీలు అక్రమంగా భూములు కొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

కాగా దీనిపై గతంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. భూములు కొన్న వ్యక్తుల పేర్లు వారి కుటుంబీకుల పేర్లు మీడియాలో కానీ వార్త పత్రికల్లో కానీ ప్రచురించవద్దని తెలిపింది. కాగా ఈ విషయమై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం జరిగింది.. సాక్షాలను చూపుతూ కొందరు జడ్జిలపై పోస్టులు చేశారు. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై అక్టోబర్ 8 న విచారణ చేసి తీర్పు రిజర్వులో పెట్టింది.. సోమవారం తీర్పు వెల్లడించింది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు రాష్ట్రప్రభుత్వం సహకరించాలని కోరింది.

see also :- కానిస్టేబుల్ స్థాయి కేసు సీబీఐ కా : ఇట్స్ వేరీ నాట్ దారుణం

కోర్టు విచారణలో భాగంగా ఈ కేసును సీబీఐ లేదా ఎన్‌ఐఏకి ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని న్యాయస్థానం సీఐడీని ప్రశ్నించింది. విచారణ సరిగానే చేస్తున్నామన్న సీఐడీ.. అవసరమైతే సీబీఐకి ఇచ్చినా తమకు అంగీకారమేనని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థ సీఐడీతోపాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా సీబీఐ విచారణకు అభ్యంతరం లేదు అని చెప్పటంతో.. ఏపీ సోషల్ మీడియాలో జడ్జీలపై కామెంట్లకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేసింది.

కాగా ఈ కేసు విచారణలో సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాగా దేశ చరిత్రలో సోషల్ మీడియా పోస్టింగులపై ఇంతవరకు సీబీఐ విచారణ చెయ్యాలంటూ ఏ కోర్టు కోరలేదు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి