AP 24/7 ఛానల్ మూసివేత

AP 24/7 ఛానల్ మూసివేత

ఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరం నుంచి మొదలైన మొట్టమొదటి శాటిలైట్ న్యూస్ ఛానల్ AP 24/7 మూసివేత కన్ఫామ్ అయ్యింది. ఉద్యోగులకు సమాచారం ఇచ్చేశారు. మూసివేస్తున్నట్లు ప్రకటించకుండా.. హైదరాబాద్ తరలిస్తున్నాం.. అక్కడి రావాలి అంటూ ఉద్యోగులతో లేఖలు రాయించుకుంటున్నారు. హైదరాబాద్ వస్తేనే ఉద్యోగం ఉంటుంది అంటూ కండీషన్ పెడుతున్నారు. విజయవాడలో ఉండి జీతం ఇవ్వలేని వారు..

హైదరాబాద్ వెళితే మాత్రం ఇస్తారా ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. నాలుగు నెలల జీతం పెండింగ్ లో ఉందని.. వాటిని చెల్లిస్తే లేఖ రాస్తాం అంటున్నారు ఉద్యోగులు. ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ చేసిన పాపాలు ఉద్యోగులకు శాపాలు అయ్యాయని అంటున్నారు ఎంప్లాయిస్. ఇప్పటి వరకు ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి పీఎఫ్ అమౌంట్ కూడా జమ చేయలేదంట.

ఇదంతా ఆ సీనియర్ జర్నలిస్ట్ ఖాతాలో పడ్డాయి అంటున్నారు. కోటిన్నర రూపాయలు నొక్కేశాడని.. సంస్థను ముంచి మరో ఛానల్ కు వెళ్లాడని.. బాగా నడిచే ఛానల్ ను నాశనం చేశాడని శాపనార్థాలు పెడుతున్నారు ఉద్యోగులు. నవంబర్ నెలలో విజయవాడలోని ఏపీ 24/7 ఛానల్ బోర్డు పీకేయనున్నారు. బిల్డింగ్ ఖాళీ చేస్తున్నారు. యాజమాన్యంలోని లుకలుకలు కూడా ఓ కారణం. 200 మంది ఉద్యోగులు భవిష్యత్ డైలమాలో పడింది. ఏడాది నుంచి మొదలైన పతనం.. ఇప్పుడు పూర్తిస్థాయికి చేరింది.

ఏపీలో పీకుతాం అంటే ఉద్యోగులు మాత్రం నమ్మటం లేదు.. నట్టేట ముంచి వెళుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతేపోయారు జీతాలు నాలుగు నెలలు ఇచ్చి వెళ్లండి లేకపోతే కదలనివ్వం అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి