సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి కారుపై దాడి..

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. రాళ్లతో అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని సీబీఐ పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. పార్కింగ్ చేసి ఉన్న కారుపై దాడి చేయడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సెక్యూటిటీ సిబ్బంది దాడిచేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్ పై పారిపోయారు.. పోతూ పోతూ కార్యాలయం ముందర ఉన్న మరో కారుపై దాడి చేశారు.. ఈ దాడిలో ఆ కారు అద్దాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిపై సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దింతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

కాగా దాడి జరిగిన సమయంలో వెంకట రెడ్డి తన నివాసంలో ఉన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కొత్త రెవెన్యూ చట్టంపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమయంలో తన వాహనంపై దాడి జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న చాడ సదస్సు ముగించుకొని కార్యాలయం వద్దకు వచ్చారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి