ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను దెబ్బతీయడాన్ని స్లెడ్జింగ్ అంటారు. ఇందులో ఆసిస్ ప్లేయర్లు చాలా ముదుర్లు. అసలు ఆస్ట్రేలియా టీమ్ అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నోసార్లు ఆ దేశ ఆటగాళ్లు స్లెడ్జింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆ దేశ క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. స్లేడ్జింగ్ హద్దు దాటొద్దని స్పష్టం చేశాడు. భారత్ టూర్ సందర్భంగా లాంగర్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సరదా సంభాషణలు, పోటీతత్వంతో ముందుకు సాగాలి కానీ.. అసభ్యకర వ్యాఖ్యలు చేయరాదని.. మాటల యుద్ధానికి దారి తీస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కాస్త గట్టిగానే చెప్పాడు.
రెండేళ్ల క్రితం ఇండియాలో పర్యటించిన సందర్భంగా.. ఆసిస్ కేప్టెన్‌తో కోహ్లీ మాటల యుద్ధాన్ని ప్రస్తావించారు. కోహ్లీ వ్యవహారశైలి ఎంతగానో ఇష్టపడతామని.. లాంగర్ చెప్పుకొచ్చారు.
కరోనా సమయంలో టీమిండియా టూర్.. క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా అవసరం అని తెలిపారు.
వాస్తవానికి ఇండియా, ఆసిస్ మ్యాచ్‌ను క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. ఆసిస్ టూర్లో గతంలో మన ఆటగాళ్లు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. ప్రస్తుతం వాటిని గుర్తు చేసుకుంటున్నారు. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న మన ఆటగాళ్లు.. ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.