త్వరలో ఇండియా మార్కెట్లోకి హోండా కొత్త బైక్

కొత్త మోడల్ బైక్ రిలీజ్ చేస్తకీ సిద్ధమైంది

హోండా

ఇండియా లో హోండా కంపెనీ బైక్స్  కి మంచి గిరాకీ.. దీనితో కొత్త మోడల్ బైక్ రిలీజ్ చేస్తకీ సిద్ధమైంది. హోండా రెబెల్ 1100 బైక్ లాంచ్ చేస్తున్నామని అధికారికముగా ప్రకటించింది. డిజైన్ విషయానికి వస్తే, రెబెల్ 500 ఇన్స్పిరేషన్ తో హోండా రెబెల్ 1100 బైక్ రూపించబడిందని జపనీస్ టూ-వీలర్ మ్యానుఫ్యాక్చరర్ వెల్లడించింది.

రిట్రో మోడల్ ని బేస్ చేసుకుని.. రౌండ్ హెడ్ లాంప్స్ , మిర్రర్స్ , బ్లాక్ ఏళ్ళోయ్, టయర్- డ్రాప్ షేప్ తో ఇంధన ట్యాంక్ నిర్మించడంతో బైక్ కి ఒక క్లాస్ లుక్ వస్తుంది. ఫుల్- డిజిటల్ ఇంస్ట్రుమెంటల్ కన్సోల్  ఫీచర్ రెబెల్ 1100 బైక్ కి మరో హైలైట్.. ఈ పవర్ ఫుల్ క్రూయిసర్ బైక్ కి LED లైటనింగ్ అమర్చడం తో పాటు 1100CC ఇంజిన్ లభిస్తుంది సేమ్ ఫ్లాగ్ షిప్ బైక్ CRF1100L ఆఫ్రికా ట్విన్ వలె. ఇంజిన్ యొక్క పవర్ 102hp వద్ద 7,500rpm అండ్ 105Nm పీక్ టోర్క్ వద్ద  6,250rpm ఉత్పత్తి ఇస్తుంది.

ఫ్రంట్ వీల్ 18-ఇంచ్ ఉండగా, రేర్ వీల్ 16-ఇంచ్ తో స్మూత్ డ్రైవ్ కు సులభంగా కంపెనీ తయారు చేసింది. రెండు వైపులా డిస్క్ బ్రేక్ చేకూర్చటం వలన డ్రైవింగ్ ని అద్భుతంగా హ్యాండిల్ చేయవచ్చని తెలుస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ABS , క్రూయిస్ కంట్రోల్ మరియు రైడింగ్ మోడ్ ఫీచర్స్ ఉండటం స్పెషలిటీ.

ఈ బైక్ మెటాలిక్ బ్లాక్ అండ్ బోర్డియక్స్ రెడ్ రంగులలో లభ్యమవుతుంది. అయితే హోండా కంపెనీ రెబెల్ 1100 బైక్ ని ఎపుడు రిలీజ్ చేస్తుంది అని డీటెయిల్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు