యమహా కొత్త బైక్ లాంచ్ – బ్లూటూత్ కనెక్టివిటీ స్పెషల్ అట్రాక్షన్

స్పెషల్ వింటేజ్ ఎడిషన్ బైక్ ,బ్లూటూత్ కనెక్టివిటీ తో యువకులను మరింత ఆకర్షిస్తుంది

యమహా FZS FI

బైక్ మీద షికారుకు పోవటం ఎవేరికి ఇష్టం ఉండదు.. అందులోనూ యమహా బైక్ అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది. యమహా, ఇండియా లో అత్యంత ప్రియమైన మోటార్ బైక్ ముఖ్యంగా యువకులకు ఎక్కువగా నచుతుంది.

ఇప్పుడు కొత్తగా యమహా మోటార్ సంస్థ స్పెషల్ వింటేజ్ ఎడిషన్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. యమహా FZS FI పేరుతో కొత్త స్టైల్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకుని బ్లూటూత్ కనెక్టివిటీ తో యువకులను మరింత ఆకర్షిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 1,09,700 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండగా, ఈ కొత్త ఎడిషన్ బైకును డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అందుబాటులో ఉంటుందని యమహా ప్రకటించింది.

బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఈ మోటార్ బైక్ స్పెషాలిటీ అని చెప్పాలి, బ్లూ టూత్ ఫీచర్ ను యుటిలైజ్ చేసుకోవటనికి “యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ అప్లికేషన్” కుడా యమహా కంపెనీ లాంచ్ చేసింది.

మరిన్ని ప్రత్యేకతలు గురించి మాట్లాడితే, లెదర్ ఫినిష్ స్ప్లిట్ సీట్ మరియు వింటేజ్ గ్రాఫిక్స్ విత్ క్లాసిక్ లుక్ వంటివి హైలైట్ గ నిలిచింది. బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్ ఇంట్రడ్యూస్ చెయ్యటం తో సేఫ్టీని మొబైల్ అప్లికేషన్ ద్వారా నియంత్రవచు అని యమహా తెలిపింది. ఫ్యూచర్ లో కుడా బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్ ని అన్ని బైక్స్ లోను ఉండేలా రూపుదిద్దుతామని యమహా పేర్కొనింది. ఈ బ్లూ టూత్ కనెక్టివిటీ ఉండటం వలన మరెన్నో ఫీచర్స్ ని పొందవచ్చు అని స్పష్టం చేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు