2000 సేల్స్ తో టాటా కొత్త మైల్ స్టోన్

ఈ సంవత్సరం ఆగష్టు నెల ఆఖరికి Tata Nexon EV 1000 సేల్స్ అవ్వగా.. సెప్టెంబర్ టు నవంబర్ - 3 నెలలో 1000 సేల్స్ జరగడం విశేషం.

Tata Nexon EV

కార్ అనే పదం వినగానే మనకి చాలా రకాల కంపెనీ పేర్లు గుర్తొస్తాయి.. అందులో ఒకటి టాటా మోటార్స్. ఈసారి మనకి బాగా గుర్తుండిపోయేలా కొత్త రికార్డు సృష్టిచింది టాటా. ఫ్లాగ్ షిప్ Tata Nexon EV 2000 సేల్స్ దాటడంతో ఒక మైల్ స్టోన్ నమోదుచేసుకున్నారు అని.. నవంబర్ 2020 నాటికి 2200 యూనిట్ల కార్లు అమ్మకం జరిగాయి అని టాటా వెల్లడించింది.

దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనల పై  డిమాండ్ ఉండడం, ఈ సంవత్సరం ఆగష్టు నెల ఆఖరికి Tata Nexon EV 1000 సేల్స్ అవ్వగా.. సెప్టెంబర్ టు నవంబర్ – 3 నెలలో 1000 సేల్స్ జరగడం విశేషం.

Nexon EV కార్ ఇప్పుడు ఇండియాలో బెస్ట్-సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ అనే చెప్పాలి, ప్రస్తుతం EV సెగ్మెంట్ కార్లతో.. టాటా మోటార్స్ 74%  మార్కెట్ షేర్ తో లీడింగ్ లో ఉంది. శైలేష్ చంద్ర- టాటా మోటార్స్  ప్రెసిడెంట్ అఫ్ ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ మాట్లాడుతూ ఇటువంటి క్షణం ఎంతో ఆనందనం లభించిందని.. అలాగే ఈ EV తయారీ విభాగం చాలా కష్టపడ్డారు అని చెప్పుకొచ్చారు.

Nexon EV రికార్డు స్థాయిలో సేల్స్ వచ్చింది ఎందుకంటే ఇది బహుచక్కటి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తో ఆకర్షించే ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉండడంతో  కస్టమర్స్ అంగీకరించారు అని చంద్ర పేర్కోన్నారు.

EV కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే కాదు, తక్కువ కాస్ట్ కి లభించడం.. అలాగే  కస్టమర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు గురించి అవగాహనా పెంచుకుని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్ని సేల్స్ సాధ్యమయింది. త్వరలో ఇండియా కస్టమర్స్ కు EV ప్రధానమైన ఛాయస్ అవ్వుతుందని టాటా యాజమాన్యం నమ్ముతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు