నేను మందిస్తే కరోనా మాయం.. ఒక్కొక్కరి నుంచి రూ. 12 వేలు వసూలు చేసిన బాబా

నేను మందిస్తే కరోనా మాయం.. ఒక్కొక్కరి నుంచి రూ. 12 వేలు వసూలు చేసిన బాబా

కరోనా కష్టకాలంలో మెడికల్ దందా ఓ రేంజ్ లో నడుస్తున్న విషయం తెలిసిందే.. ఒక్క ఆక్సిజెన్ సిలిండర్ లక్షకు అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక కరోనాను అడ్డం పెట్టుకొని ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారు.. ఆసుపత్రుల సంగతి చెప్పనవసరం లేదు. కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రికి పొతే వారు వేసే బిల్లులు చూసి దేవుడా అంటూ గుండెలమీద బాదుకోవాల్సిందే..

ఇక ఈ నేపథ్యంలోనే ఓ బాబా వెలుగులోకి వచ్చాడు. కరోనా మహమ్మారిని తరిమికొడతా అంటూ తన శిష్యులతో ప్రచారం చేయించుకున్నాడు. కరోనాపై యుద్దానికి సిద్దమైనట్లు ఫోజులు ఇచ్చాడు.. హైదరాబాద్ హాఫిజ్ పెట్, హనీఫ్ కాలనీలో ఉండే ఇస్మాయిల్‌ బాబా ప్రజల్లోని కరోనా భయాన్ని కాష్ చేసుకోవాలని అనుకున్నాడు..

అనుకున్నదే తడవుగా తన శిష్యులతో విపరీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తన దగ్గర కరోనా మందు రూ. 12 వేలకే దొరుకుతుందని అమాయకులను నమ్మించాడు. ఇది వాడితే వెంటనే కరోనా పోతుందని నమ్మబలికాడు. ఇలా చాలామంది నుంచి డబ్బులు గుంజాడు. బిజినెస్ సాఫీగా సాగుతున్న సమయంలో తన శుష్యుల్లో ఒకరు అతడి మిత్రుడికి ఈ విషయం తెలిపాడు..

దింతో శిష్యుడి మిత్రుడు బాబా దగ్గరకు వచ్చి వివరాలు అడిగారు. బాబా మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో పోలీసులు బాబా ఇష్మాయిల్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మీడియా ప్రతినిధులు సదరు బాబాను ప్రశ్నించగా అలాంటివి ఏమని లేవని మాట దాటేశాడు. కాగా ప్రస్తుతం బాబా పోలీసుల అదుపులో ఉన్నారు..

కరోనా మందు కోసం డబ్బు చెల్లించినవారు వందల్లో ఉంటారని సమాచారం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు