ఆరోగ్యాన్ని ప్రసాదించే అగ్ని గాయత్రి మంత్రం – ప్రతి రోజు తప్పక చదవండి

మానవ జాతికి మేలు చేకూర్చడానికి అనేక మంది ఋషులు, జ్ఞానులు వేదాలను,పురాణాలను మనకు అందించారు. సాధారణ మానవులు తమ రోజువారి కార్యక్రమాలను, విధులను విడిచిపెట్టి వేదాలలో చెప్పిన ప్రతి అంశాన్ని పాటించడం సాధ్యం కాదు కాబట్టి వారి కోసం పూజలు, యజ్ఞాలు, మంత్రాలు వంటి అనేక పద్దతులను కనిపెట్టి వాటిని పాటించిన వారికి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవితం లభిస్తుందని వెల్లడించారు. సాధారణ మానవులకు మన వేదాలు ప్రసాదించిన మంత్రాలలో అద్భుతమైన ఒక మంత్రమే అగ్ని గాయత్రి మంత్రం.

ఈ అగ్ని మంత్రం ప్రతి రోజు శ్రధ్ధగా పఠించిన వారికి చక్కని ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు లభిస్తాయని, ప్రతి రోజు నిష్టగా సాధన చేయడం వల్ల శరీరం, మనస్సు, ప్రాణము శుద్ధి అవుతాయని వేదాలు చెబుతున్నాయి. మంత్రాలకు , మంత్ర శబ్దాల వల్ల కలిగే తరంగ ప్రతిస్పందనలు పథార్థాలను అనేక మార్పులకు గురి చేస్తాయని ఇటీవలి కాలంలో జరిగిన అనేక పరిశోధనలు నిరూపిస్తున్నాయి, కాబట్టి ఎటువంటి అనుమానాలు మనస్సులో ఉంచుకోకుండా తప్పక ఈ గాయత్రి అగ్నిమంత్రాన్ని ప్రతి రోజు తప్పక చదవండి. ఇప్పుడు ఈ అగ్ని గాయత్రి మంత్రాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం.

ప్రశాంతంగా ఏదైనా గదిలో లేదా ఎవరు కదిలించని చోట ప్రశాంతంగా కూర్చోని మీ ఎదురుగా ఏదైనా ఒక కొవ్వొత్తి లేదా ఒక దీపం ఉంచుకోని,

ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అంటూ అగ్ని గాయత్రి మంత్రాన్ని జపించాలి. మరొక్కసారి శ్రద్దగా చదవండి, ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్

మానవుడు ఆహారం వండుకోవాలంటే మనకి కావాల్సింది అగ్ని, మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే మనకి కావాల్సింది జఠరాగ్ని, అంటే మానవ జీవితంలోని రెండు అతి ముఖ్యమైన కార్యాలకు ముఖ్యంగా కావాల్సిన అగ్ని దేవున్ని ప్రతి రోజు ప్రార్థించడం వల్ల ప్రతి ఒక్కరికి తప్పక మంచే జరుగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు