శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం 10 రోజులు

శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం 10 రోజులు.. దేవస్థానం చరిత్రలోనే ఇది సంచలన నిర్ణయం కాబోతున్నది. పాలక మండలి సమావేశంలో సభ్యులు అందరూ అంగీకరించారు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సారి అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనం రోజులను పెంచింది. గతంలో ఎప్పుడూ రెండు, మూడు రోజులు మాత్రం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం కల్పిస్తారు. ఈ రెండు రోజులు వీవీఐపీలకే దర్శన సమయం సరిపోతుంది. సామాన్యులకు దర్శనం దుర్లభం అయ్యేది. లక్షలాది మంది భక్తులు వచ్చినా.. రెండు రోజులు పడిగాపులు కాసేశారు.

ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనాన్ని 10 రోజులు కల్పించాలని నిర్ణయించింది టీటీడీ. దేవస్థానం చరిత్రలోనే ఇది సంచలన నిర్ణయం కాబోతున్నది. పాలక మండలి సమావేశంలో సభ్యులు అందరూ అంగీకరించారు. సామాన్యులకు సైతం వైకుంఠ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో.. శ్రీవారి సేవలో తరలించే భాగ్యం కల్పించటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలనే నిర్ణయంపై అర్చకులు, అధికారులతో కమిటీ నియమించింది టీటీడీ. ఆ ప్రకారం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండలి ఓకే అనటంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనట్లే అని అంటున్నారు అధికారులు. 2021, జనవరి 9వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు