దీక్ష విరమించని బండి సంజయ్

దీక్ష విరమించని బండి సంజయ్

సోమవారం దుబ్బాకలో జరిగిన ఘటనపై బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి తన కార్యాలయంలో నిరసన దీక్షకు పూనుకున్నారు సంజయ్. ఆయన దీక్షకు సంఘీభావంగా కార్యాలయం బయట కార్యకర్తలు బైఠాయించారు.

ఇక పోలీసుల వ్యవహార శైలిపై బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్ కు తరలించారని అన్నారు. సీపీని వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు సంజయ్.

దుబ్బాకలో ప్రశాంతగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుస్తుందని భావించి అధికార టీఆర్ఎస్ అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాగా బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టి 12 గంటలు అవుతుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి