కర్ణాటకలోని బెంగూళూరు వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. క్యాన్సర్ కారణంగా నాలుకను కోల్పోయిన ఒ ఆటో డ్రవైర్ కు కొత్త నాలుకను అతికించారు. బెంగూళూరుకు చెందిన 57 సంవత్సరాల ఆటో డ్రైవర్ నోటిలో క్యాన్సర్ కారణంగా ట్రస్ట్ వెల్ అనే హాస్పటల్లో చేరాడు.
అతన్ని పరీక్షించిన డాక్టర్లు, క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడానికి, నాలుకలో మూడొంతుల భాగాన్ని కత్తిరించేశారు. నాలుగు లేకపోతే ఉండే ఇబ్బందులను గమనించిన డాక్టర్లు ప్రయోగాత్మకంగా, సదరు వ్యక్తి కడుపులోని కొంతభాగాన్ని తీసుకోని నోట్లో అమర్చారు. దాదాపు 10 గంటలు కష్టపడి చేసిన సర్జరీ విజయవంతం అయినట్టు డాక్టర్లు వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో అతను సాధారణ వ్యక్తుల వలే ఆహారాన్ని తీసుకోవచ్చని వారు వెల్లడించారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి