పోలీసుల ముందే కర్రలతో దాడి.. 50 మందికి గాయాలు

పోలీసుల ముందే కర్రలతో దాడి.. 50 మందికి గాయాలు

దసరా సందర్బంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల యుద్దాన్ని బన్ని వేడుక అని పిలుస్తారు.. ఈ వేడుక ప్రతి ఏడాది దసరా తరువాతి రోజు జరుగుతుంది. వేలమంది బక్తులు రోడ్డుపైకి వచ్చి కర్రలతో కొట్టుకుంటారు. అయితే కరోనా నేపద్యంలోనే ఈ ఉత్చావాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

ఈ మేరకు భారి సంఖ్యలో పోలీసులను మొహరించారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేడుకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కానీ పోలిసుల కళ్ళు కప్పి రాత్రి పదిగంటలకు బయటకు వచ్చి బన్ని వేడుకను నిర్వహించారు. కొండలపై నుంచి తండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు.

సోమవారం రాత్రి పదిన్నర వరకు ఎలాంటి హడావుడి లేక బోసిపోయినట్టు కనిపించిన తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. అర్చకులు స్వామి వారికి కల్యాణం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకొచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు.

అక్కడి నుంచి విగ్రహాలకు భక్తులు కర్రలు అడ్డుగాపెట్టి రాక్షసపడ వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి రాగానే విగ్రహాలను చేజిక్కిచుకునేందుకు జరిగిన కర్రల సమరంలో  50 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి