క్రికెట్ అభిమానులకు తీపి కబురు భారత్, ఆస్ట్రేలియా పర్యటనకు షెడ్యూల్ ఖరారు

క్రికెట్ అభిమానులకు తీపి కబురు భారత్, ఆస్ట్రేలియా పర్యటనకు షెడ్యూల్ ఖరారు

కరోనా కారణంగా భారత క్రికెట్ ఫాన్స్ కు అనుకున్నంత ఆనందం కలగలేదు. ఐపీఎల్ ఉన్న అది విదేశాల్లో ఉండటం, కరోనా నిబంధనల వలన వెళ్లి చూసే అవకాశం లేకపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే ఫాన్స్ కి బూస్ట్ ఇచ్చే న్యూస్ చెప్పింది బీసీసీఐ, తాజాగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ కు ఆటగాళ్లను ప్రకటించిన బీసీసీఐ, మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

మూడు ఫార్మేట్ల మ్యాచ్ లు ఆడేందుకు భారత్ ఆస్ట్రేలియా వెళ్లనుంది. వీటిలో మూడు వన్డే మ్యాచ్ లు, రెండు టి20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. తోలి వన్డే సిడ్నీ వేదికగా నవంబర్ 27 న జరగనుంది. రెండో వన్డే నవంబర్ 29 సిడ్నీలోనే జరగనుంది. ఇక మూడోవన్డే మ్యాచ్ డిసెంబర్ 2 న మనుక ఓవల్ లో జరుగుతుంది.. కరోనా కారణంగా తోలి రెండు వన్డే మ్యాచ్ లను సిడ్నీలోనే ఆడించడం జరుగుతుంది.

ఇక టి20 విషయానికి వస్తే డిసెంబర్ 4 న మనుక ఓవల్ వేదికగానే జరుగుతుంది. రెండో టి 20 సిడ్నీ వేదికగా డిసెంబర్ 8 న జరగనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే అండ్ నైట్ గా జరగనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరుగుతుంది. మూడో టెస్ట్ జనవరి 7 నుంచి 11 వరకు నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి