పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత దారుణ హత్య

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతలను టార్గెట్ గా చేసుకొని దాడులు హత్యలు చేస్తున్నారు.. గత మూడేళ్ళలో ఇది ఇదో ఘటన.. గతేడాది ఓ కుటుంబాన్ని దారుణంగా హత్య చేశారు. కేవలం బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకే 9 నెలల గర్భవతి అయిన భార్యను నాలుగేళ్ళ చిన్నారిని, అతడి తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేశారు.

అది మరిచిపోకముందే ఆదివారం రాత్రి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగఢ్ మునిసిపల్ కౌన్సెలర్ మనీశ్ శుక్లాపై నిన్న రాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మనీశ్ తీవ్రంగా గాయపడ్డారు. దింతో అతడిని కోల్ కతా లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మనీశ్ మృతి విషయం తెలిసిన బీజేపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు, మనీశ్ హత్యకు నిరసగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బీజేపీ నేత హత్యపై గవర్నర్ స్పందించారు.. ముఖ్యమంత్రి, డీజీపీ తనతో భేటీ అవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గవర్నర్ మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు తరచు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక వీరి భేటీ తర్వాత కీలక విషయాలు బయటకు రానున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి