ప్రేమించి గర్భవతిని చేసి పారిపోయాడు యువతి బిడ్డకు జన్మనిచ్చింది

ప్రేమించి గర్భవతిని చేసి పారిపోయాడు యువతి బిడ్డకు జన్మనిచ్చింది

ఇదో విచారణ ఘటన, యువతి యువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండానే చెట్టాపట్టాలేసుకుకొని తిరిగారు. దింతో యువతి గర్భం దాల్చింది. చివరికి యువతిని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం, అల్లంపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే లక్ష్మీ పేట పంచాయతీ, కప్పాడ గ్రామానికి చెందిన ఏలీయా అనే యువకుడిని యువతి ప్రేమించింది. అతడితో చనువుగా ఉంది. ఈ తరుణంలోనే గర్భం దాల్చింది. మంగళవారం పెదబయలు పీ హెచ్ సీ మంగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ సందర్బంగా యువతి మాట్లాడుతూ..

ప్రేమ పేరుతొ రెండేళ్లు తనను శారీరకంగా అనుభవించాడని పెళ్లి విషయం ఎత్తగానే మొహం చాటేసి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడని అంటుంది. కాగా మగ బిడ్డకు జన్మనిచ్చిన యువతి తన కొడుకుకు న్యాయం చెయ్యాలని వేడుకుంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి