సీన్ రివర్స్ అయిన టీఆర్ఎస్ సానుభూతి ప్లాన్ – చెరుకు శ్రీనివాసరెడ్డి వైపే మెజార్టీ

దుబ్బాక నియోజకవర్గంలో సానుభూతి లెక్కలపై డిస్కషన్ జరుగుతుంది. టీఆర్ఎస్ లేవనెత్తిన అంశం.. ఆ పార్టీకే రివర్స్ అయ్యింది. సానుభూతి అన్నప్పుడు సోలిపేట ఫ్యామిలీకి ఎంత ఉందో.. ముత్యంరెడ్డికి అంతే ఉంది. దీనికి కారణం లేకపోలేదు అంటున్నారు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లో ముత్యంరెడ్డికి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఇప్పుడు లేరు.
ఆయనకు న్యాయం చేయరా..

ముత్యంరెడ్డిపై సానుభూతి లేదా.. 40 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన పెద్దాయన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రజలే చర్చించుకోవటం విశేషం. చెరుకు శ్రీనివాసరెడ్డిని వాడుకుని వదిలేశారు అన్నది నిజం కాదా అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలే సోలిపేట ఫ్యామిలీకి టికెట్ ఇవ్వొద్దు ఆందోళనలు చేయటం నిజం కాదా అని నిలదీస్తున్నారు. ముత్యంరెడ్డికి సానుభూతి ఎక్కువగా ఉంది.. ఆయన వైపే మెజార్టీ ఉంది అంటున్నారు దుబ్బాక నియోజకవర్గం ఓటర్లు. టీఆర్ఎస్ పార్టీలోనే సొంత వ్యతిరేకత ఉన్నా.. ఓ మంత్రి తన నియంతృత్వం కారణంగా చెరుకు శ్రీనివాసరెడ్డికి అన్యాయం చేయటం ఏంటని నిలదీస్తున్నారు దుబ్బాక నియోజకవర్గం ఓటర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి