GSTలో రూ.5 కోట్ల లంచం – బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు – సుజనాచౌదరి కంపెనీలతో లింక్స్

ఈ ఒక్క విషయంలోనే కాకుండా.. భారీ అక్రమాలతో.. ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అనుమానిస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడు కావటంతో

ఏపీలో మరో భారీ కుంభకోణం అసలు రూపం బయటపడింది. సీబీఐ కేసు నమోదుతో సంచలనంగా మారింది. జీఎస్టీలో జరిగిన ఈ తతంగం.. దేశాన్ని షాక్ కు గురి చేసింది. ఏపీ రాష్ట్రానికి చెందిన అధికారే కావటం కలకలం రేపుతోంది. ఏం జరిగిందో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం..

ప్రైవేట్ కంపెనీ లెక్కలు తారుమారు :

బొల్లినేని గాంధీ.. 2017 నుంచి జీఎస్టీ కమిషనర్. ప్రైవేట్ కంపెనీకి చెందిన జీఎస్టీ లెక్కలను తారుమారు చేశారు. దీని వల్ల ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును మాఫీ చేశారు. దీని కోసం 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. లంచం తీసుకోవటానికి సిద్ధం అయ్యారు. ప్రైవేట్ కంపెనీతో బేరసారాలు నడిపారు. కంపెనీ లెక్కల్లోని అవకతవకలను సరి చేయటానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్‌ ఉద్యోగులు కూడా సహకరించారు. ఇందులో సీహెచ్‌ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఉన్నారు. వీరు ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆ డాక్యుమెంట్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. కేసు నమోదు చేసింది.

కంప్లయింట్స్ తో సీబీఐ ఎంట్రీ :

బొల్లినేని శ్రీనివాస గాంధీ వ్యవహారంపై కేంద్ర జీఎస్టీకి కంప్లయింట్స్ వెళ్లాయి. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. రంగంలోకి దిగిన సీబీఐ అన్ని కోణాలు విచారణ చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీ లాండరింగ్స్ పై వచ్చిన కంప్లయింట్స్ ను కూడా బొల్లినేని శ్రీనివాస గాంధీ.. బుట్టలో పడేశారంట. ఆధారాలను తారుమారు చేశారంట. ఏకంగా ఫైల్స్ ను మాయం చేశారంట. ఇలా చేసినందుకు 5 కోట్ల రూపాయల లంచం కూడా డిమాండ్ చేశారంట. ఈ ఒక్క విషయంలోనే కాకుండా.. భారీ అక్రమాలతో.. ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అనుమానిస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడు కావటంతో టీడీపీలోనూ కలకలం. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు.. గాంధీకి అమరావతి ప్రాంతంలో భూమి ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీనిపైనా సీబీఐ విచారణ జరుగుతుంది.

ఇప్పటికి అయితే ప్రైవేట్ కంపెనీ జీఎస్టీ లెక్కలను తారుమారు చేసినందుకు 5 కోట్ల రూపాయల లంచంపై కేసు నమోదు చేసింది సీబీఐ. మిగతా వ్యవహారాలపై విచారణ కొనసాగుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి