OTT నియంత్రణ వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులుగా నేటి యువత

రాబోయే రెండేళ్లలో మరో 2 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్న సమయంలో.. ఉన్న 3 లక్షల మంది ఉపాధి పోవటం

OTT ప్లాట్ ప్లాంను కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకెళ్లటం, కొత్త రూల్స్ తీసుకురావటం వల్ల దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేశాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆల్ట్ బాలాజీ, జీ, హాట్ స్టార్ లతోపాటు మిగతా అన్ని సంస్థలు తమ షూటింగ్స్ నిలిపివేయటంతో 3 లక్షల మంది నేటి యువత నిరుద్యోగులుగా మారారు.
సినిమా, టీవీ సీరియల్స్ తో అవకాశాలు రాని లక్షల మందికి ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
కంటెంట్ రైటర్స్, దర్శకులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, షూటింగ్ సిబ్బంది అంతా కలిసి దేశంలో 3 లక్షల మంది కుర్రోళ్లు ఓటీటీ ద్వారా ఎంప్లాయ్ మెంట్ పొందుతున్నారు.

మూడేళ్లుగా ఊపందుకున్న ఓటీటీ ప్లాట్ ఫాం ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషల్లోకి కూడా వస్తోంది. సినిమా, టీవీ సీరియల్స్ కు పోటీగా ఎదుగుతోంది.
ఇలాంటి టైంలో ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అనే సరికి అందరూ షూటింగ్స్ నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ఎలా ఉంటాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఉద్యోగం, ఉపాధి ఉంటుందా ఊడుతుందా అనే బెంగలో ఉన్నారు.
కరోనాతో దేశవ్యాప్తంగా ఓటీటీలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది.

రాబోయే రెండేళ్లలో మరో 2 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్న సమయంలో.. ఉన్న 3 లక్షల మంది ఉపాధి పోవటం అందరికీ షాక్ కు గురి చేసింది.

సినిమా, టీవీ సీరియల్స్ లో చూపించలేనిది.. డిఫరెంట్, బోల్డ్, క్రైం, థ్రిల్లర్, రొమాంటిక్ కంటెంట్ ఆధారంగానే ఓటీటీకి గుర్తింపు ఉంది. అలాంటి ఓటీటీని సీరియల్స్, సినిమా తరహాలో తెరకెక్కిస్తే చూసేవాళ్లు ఎవరూ ఉండరు. ఈ క్రమంలోనే 3 లక్షల మంది ఓటీటీ ఉద్యోగులు.. అందులోనూ నేటి యువత నిరుద్యోగులుగా మారటం అనూహ్య పరిణామం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి