కేంద్రం కీలక సూచన :- కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రోజుకు సుమారు 80 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితుల విషయంలో తాజాగా కేంద్ర సర్కారు మరికొన్ని సూచనలు చేసింది. వైరస్ బారినపడి కోలుకున్నవారిలో కొన్ని రోజులపాటు లక్షణాలు ఉంటాయని చెప్పింది. ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటివి వారిలో కనపడతాయని తెలిపింది.

ఈ సమస్యల వలన బాధితులు ఆందోళన చెందాల్సిన వసరం లేదని కేంద్రం పేర్కొంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి సమయం ఎక్కువ పట్టే అవకాశముందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వ్యాయామం చేయాలని, అటువంటి వారు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు షోషకాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని సూచనలు చేసింది.

బాధితులు గుండె పని తీరుతో పాటు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు తప్పని సరి పాటించాలని సూచించింది. మాస్క్, శానిటైజర్ వాడాలని సూచించింది కేంద్రం అలాగే, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తీవ్రతరమైతే ఆలస్యం చేయొద్దని, వైద్యులను సంప్రదించాలని తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి