పోలవరంలో చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాలు ప్రాజెక్టుకు గుదిబండలా మారాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు, చేసిన తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపాలుగా మారాయి. చంద్రబాబు చేసిన తప్పిదం వలన పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. ప్రాజెక్టులో ముందు స్పిల్ వే పనులు జరగాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా అసలు పనులు నిలిచిపోయాయి. గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. కాఫర్ డ్యాం, స్పిల్ వే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి గత ప్రభుత్వ నిర్వాకాలు అందులో మచ్చుకు కొన్ని….
• పోలవరం స్పిల్ వే బ్రిడ్జి లో దాదాపు 14 బ్లాకులలో ట్రూనియన్ భీంల కోన్ లు ఫెయిల్ అయ్యాయి. ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్ల గ్యాఫ్-1 అప్రోచ్ ఏరియా మొత్తం కోతకు గురైంది.
• ఎగువ కాఫర్ ఢాం నిర్మించడం వల్ల 2019,2020 రెండు సీజన్లలోనూ వరదలు స్పిల్ వే మీదుగా రావడం వల్ల స్పిల్ ఛానెల్ పనులకు, స్పిల్ వే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడి విలువైన సమయాన్ని కోల్పోవలసి వచ్చింది.
• స్పిల్ ఛానెల్ లో నిలిచిపోయిన వరద నీటిని తోడటానికి దాదాపు 2నెలల సమయం పట్టడం వల్ల ప్రతి సంవత్సరం సమయం వృధా అవ్వడం తో పాటు ఇదొక అదనపు వ్యయం.
• నిబంధనలకు విరుద్ధంగా కాపర్ డ్యాం నిర్మించడం పెద్ద తప్పిదం.
• 2019, 2020 సంవత్సరాలలో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు పంటనష్టం, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇదంతా చంద్రబాబు అండ్ కంపెనీఈ ఆధ్వర్యంలో నిబందనలకు విరుద్దంగా కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్లనే.
• ఈ రెండు సంవత్సరాలలో వరదల వల్ల నష్టపోయిన వారికి ఒక్కరూపాయి కూడా చంద్రబాబు కాంట్రాక్టు కంపెనీ తరఫున నష్టపరిహారం అందలేదు. ముఖ్యంగా నిర్మాణం, ప్రణాళికలో అనాలోచిత నిర్ణయాలు, నాన్ ఇంజనీరింగ్ పద్దతులు అవలంబించడం చంద్రబాబు కాంట్రాక్టు కంపెనీ చేసిన ద్రోహం
• సహాయం పునరావాసం పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం మరో లోపం
• స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం మరియు ఇతర నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం సోమవారాన్ని పోలవరంగా వాడుకున్న చంద్రబాబుకే చెల్లింది
• ఎగువ,దిగువ కాఫర్ డ్యాంలు నిర్మాణాలు కూడా అసంపూర్తిగా నిర్మించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు అప్పట్లో
• అప్రోచ్ ఛానెల్,పైలెట్ ఛానెల్ పనులుకు ఆటంకం ఏర్పడటం కూడా గత ప్రభుత్వ వైఫల్యాల్లో భాగమే
• మూలలంకలో డంప్ యార్డ్ కోసం 2 పంటలు పండే 203 ఎకరాల భూమిని నష్టపరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకోవడం కూడా పోలవరం నాయుడు కంపెనీ పనే
• డంప్ యార్డ్ సమీపంలోని డ్రైనేజ్ కాలువ పూడిపోయినా ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి పోలవరం నాయుడు కంపెనీ సమాధానం చెప్పాలి.
• ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోలవరంలో హాస్పటల్, కాలేజ్ లను అభివృద్ది చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడం చంద్రబాబు కాంట్రాక్టు కంపెనీ పనే…