డాక్టర్లను మెచ్చుకున్న ఛార్మి.. చాలా గొప్పగా వైద్యం చేస్తున్నారని కితాబు

డాక్టర్లను మెచ్చుకున్న ఛార్మి.. చాలా గొప్పగా వైద్యం చేస్తున్నారని కితాబు

ఛార్మి కౌర్ తల్లిదండ్రులలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా వారు ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా వారి ఆరోగ్య ప‌రిస్థితి గురించి ట్వీట్ చేశారు.

“నా పేరెంట్స్‌ను న‌వ్వు ముఖాల‌తో చూడ‌టం చాలా బాగుంది” అని సంతోషం వ్య‌క్తం చేశారు. లాక్‌డౌన్ ప్రారంభ‌మైన మార్చి నుంచి వారు నిబంధ‌న‌ల‌ను తు.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. అయినా దురదృష్టం కొద్దీ వారు కోవిడ్‌-19 బారిన ప‌డ్డారు. బ‌హుశా హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల మూలాన ఇది జ‌రిగి ఉంటుంది. ఇప్ప‌టికే మా నాన్న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ఈ వార్త విని నా గుండె ముక్క‌ల‌య్యింది.

వెంట‌నే అమ్మానాన్న ఇద్ద‌రూ ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరారు. అక్క‌డ నాకు చాలాకాలంగా తెలిసిన‌ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. అని తెలిపారు. వైద్య బృందం జాగ్రత్త చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వైద్య బృందం వారిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నా త‌ల్లిదండ్రులు చికిత్స‌కు స్పందిస్తున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి