కీలక వ్యాఖ్యలు చేసిన యోగి:- మొఘలులు మనకు హీరోలు కాదు. ఛత్రపతి శివాజీ మన హీరో

మొగలుల పేరుమీద ఉన్న ప్రాంతాల పేర్లను ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తున్నారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. పదవిలోకి వచ్చిన మూడేళ్ళలో 10కి పైగా పట్టణాల పేర్లు మార్చారు. పర్యాటక కేంద్రల పేర్లను కూడా మార్చారు. ఇక ఇప్పుడు ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును కూడా మారుస్తున్నట్లు సీఎం యోగి తెలిపారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంగా నామకరణం చేస్తున్నలు వివరించారు. రాష్ట్రంలో బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క గుర్తును, సూచికను ఉంచబోమని స్పష్టం చేశారు. మొఘలాయిలను మన హీరోలుగా ఎందుకు ఉండనిస్తామని ప్రశ్నించారు. శివాజీ మహరాజ్ మనకు హీరో అని అభివర్ణించారు. అయితే ఈ మ్యూజియంను 2015 లో అరెకరాల ప్రాంతంలో నిర్మించేందుకు నాటి సీఎం అఖిలేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి