హీరో మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

హీరో మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు, ఆచార్య సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు పరీక్ష చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దింతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక గత నాలుగైదు రోజులుగా తనను కలిసిన వారిని టెస్ట్ చేసుకోవాలని చిరంజీవి కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలియచేస్తానని చిరంజీవి వివరించారు.

కాగా ఆదివారం చిరంజీవి నాగార్జున కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. అంతకుముందు కూడా చిరంజీవి పలువురు పెద్దలను కలిసినట్లుగా సమాచారం. ఇక నాగార్జున కూడా టెస్ట్ కు వెళ్లినట్లు సమాచారం. కాగా కేసీఆర్ ను కలవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ కూడా కరోనా టెస్ట్ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి