పదిమంది బృందంతో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లారు. సీఎం మామ గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని.. ఇక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరారు. జగన్ తో పాటు 10 మంది బృందం ఢిల్లీకి పయనమైంది. రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత అధికారులకు జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారైంది. మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవికూడా వైసీపీకి వరిస్తుందని వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి