రామానాయుడు కాదు డ్రామానాయుడు : ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం జగన్

రామానాయుడు కాదు డ్రామానాయుడు : ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం జగన్.. ఇక నుంచి సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వొద్దు అని స్పీకర్ ను కోరారు వైసీపీ ఎమ్మెల్యేలు. 2018 సెప్టెంబర్‌ 3న చెప్పిన మాటనే మేనిఫెస్టోలో పెట్టాం అన్నారు.

CM Jagan serious on TDP Mla ramanaidu in pensions issue
CM Jagan serious on TDP Mla ramanaidu in pensions issue

ఏపీ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లపై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ అసెంబ్లీలోనే సీరియస్ అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం జగన్ లేచి.. రామానాయుడు వైఖరిని ఖండించటంతో సభలో ఒక్కసారి హై టెన్షన్ నెలకొంది.

రాష్ట్రంలో పెన్షన్లపై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు 2 వేల 250 మాత్రమే ఇస్తున్నారని.. ఇది మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు.

ఇక్కడే సీఎం జగన్ కు కాలిపోయింది. రామానాయుడు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని.. డ్రామానాయుడు అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూపిస్తూ.. విడతల వారీగా.. సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ.. 3 వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అని చెప్పాం అని.. అందుకు సాక్ష్యం మానిఫెస్టో అని చూపించారు. గతంలో ఇచ్చిన హామీ ఆడియో, వీడియో కూడా చూపించారు. ఇంత క్లారిటీగా ప్రభుత్వం ఉంటే.. 3 వేల రూపాయలు ఇస్తాం అని టీడీపీ ఎలా అంటుందని సీఎం జగన్ మండిపడ్డారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. ఇక నుంచి సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వొద్దు అని స్పీకర్ ను కోరారు వైసీపీ ఎమ్మెల్యేలు. 2018 సెప్టెంబర్‌ 3న చెప్పిన మాటనే మేనిఫెస్టోలో పెట్టాం అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను.. కమిటీకి సిఫార్సు చేయనున్నారు. కమిటీ చర్యలు ఎలా ఉంటాయి అంటే.. ఇక నుంచి రామానాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వరు స్పీకర్…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి