కోతులకు అరటి పండ్లు తినిపించిన సీఎం కేసీఆర్

వాహనంలో నుంచి మరిన్ని అరటిపళ్ళు తీసుకొచ్చి వానరాలకు అందించారు. పుణ్యక్షేత్రాలకు

సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత పర్యటన పెట్టుకున్నారు.. కరోనా తర్వాత ఆయన తొలి పర్యటన ఇదే.. హైదరాబాద్ ప్రగతి భవన్ లేదా ఫాంహౌస్ లోనే ఉంటున్నారు.. ఈ సందర్భంలో జనంలోకి వెళ్లటానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా యాదాద్రి ఆలయం సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయం పనులు పరిశీలించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. చేర్పులు – మార్పులు చెప్పారు. పూజాలతో ముచ్చటించారు.. భక్తుల వసతులు, దర్శనం ఏర్పాట్లను తనిఖీ చేశారు.

కోతులను చూసి ఆగారు :

కొండ నుంచి కిందకు వస్తూ.. కోతుల మూకను చూసి ఆగారు సీఎం కేసీఆర్. పదుల సంఖ్యలో ఉన్న కోతులకు అరటి పండ్లు ఇచ్చారు. స్వయంగా ఆయనే పళ్లు ఇవ్వటం విశేషం. కేసీఆర్ అరటి పళ్లను ఇస్తున్న విషయం గమనించిన ఇతర కోతులు.. అక్కడికి ఒక్కసారిగా ఎగబడ్డాయి. ముఖ్యమంత్రి తన వాహనంలో నుంచి మరిన్ని అరటిపళ్ళు తీసుకొచ్చి వానరాలకు అందించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన భక్తులు.. అక్కడున్న కోతులకు ఆహారం అందించడం సహజమే.. స్వయంగా ఓ ముఖ్యమంత్రి తన కారు ఆపి అరటిపళ్లను అందించడం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి