చిన్నజీయర్ స్వామిని కలిసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. జీయర్ మాతృమూర్తి రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సీఎం వెళ్లలేకపోయారు.. కాగా సోమవారం వెళ్లి జీయర్ స్వామిని పరామర్శించారు. సీఎంతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశ్రమానికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ముచ్చింతల్ బయలుదేరి వెళ్లారు..

కాగా సీఎం ఆదివారం యాదాద్రిలో పర్యటించిన విషయం విదితమే.. యాదాద్రి దేవాలయం మొత్తం తిరిగి పరిశీలించారు. శిల్పులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి