కాంగ్రెస్ మహిళ నాయకురాలిపై దాడి చేసిన, సొంత పార్టీ నాయకులు

కాంగ్రెస్ మహిళ నాయకురాలిపై దాడి చేసిన, సొంత పార్టీ నాయకులు

సొంతపార్టీ నాయకురాలిపైనే కాంగ్రెస్ నేతలు దాడిచేశారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.. ఉత్తర్ ప్రదేశ్ లోని డియోరియా నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముకుంద్ భాస్కర్ అనే వ్యక్తికి టికెట్ కేటాయించింది అధిష్టానం..

కాగా ఆయనపై అత్యాచారం కేసు ఉంది.. దీనిని వ్యతిరేకిస్తూ మహిళా కార్యకర్త రేపిస్టులు సీటు ఎలా కేటాయిస్తారని సభలో ప్రశ్నించింది. దీంతో ముకుంద్ వర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు ప్రశ్నించిన తారా యాదవ్‌పై అనే మహిళా కార్యకర్తపై దాడికి దిగారు. కాగా, తనపై దాడి ఘటనను తారా యాదవ్ తీవ్రంగా ఖండించారు.

దాడికి పాల్పడిన వారిపై ప్రియాంకాగాంధీ చర్యలు తీసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. ఆమెపై దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి